కేంద్రం ఎందుకు స్పందించలేదు ? పొన్నం ప్రభాకర్

కేంద్రం ఎందుకు స్పందించలేదు ? పొన్నం ప్రభాకర్



హైదరాబాద్ : ముప్ఫై శాతం వాటా ఉన్నప్పటికీ ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రం ఎందుకు స్పందించలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని నిలదీశారు. సమ్మె జరిగిన 48 రోజులపాటు మౌనంగా ఉండడంలో అర్ధమేమిటన్న ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె దాదాపు ముగియనున్న తరుణంలో బీజేపీ ఇప్పుడు ఏదో చేస్తున్నట్లు, ప్రయత్నాలు చేసినట్లు నటిస్తుందని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి కోసం కేంద్ర రవాణా శాఖ మంత్రి ఫోన్‌లో ప్రయత్నం చేస్తే 'ఆయన కలవలేదు' అని చెబుతున్నారంటే... బీజేపీ‌కి తల దించుకుని పరిస్థితి వచ్చినట్లేనని వ్యఖ్యానించారు. ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుంది ? అని ప్రశ్నించారు. బీజేపీ, టిఆర్ఎస్ లు ఢిల్లీలో దోస్తీ, గల్లీ లో కుస్తీ లాగా నటిస్తున్నారని ప్రభాకర్ ధ్వజమెత్తారు.